Sri Reddy: రేణుకా చౌదరికి కృతజ్ఞతలు చెప్పిన నటి శ్రీరెడ్డి!

  • చట్టసభల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న రేణుకా చౌదరి
  • నా పోరాటానికి మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు
  • ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి
క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదని, అందుకు చట్ట సభలు కూడా అతీతం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రేణుకా చౌదరికి నటి శ్రీరెడ్డి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ తన పోరాటానికి మద్దతిస్తున్న రేణుకా చౌదరికి కృతజ్ఞతలని వ్యాఖ్యానిస్తూ, ఓ టీవీ చానల్ కు రేణుక ఇచ్చిన ఇంటర్వ్యూ లింకును పోస్టు చేసింది.

ఆపై తన నిరసనలకు మద్దతిస్తున్న ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ చైర్మన్ తో పాటు ప్రతి విద్యార్థికీ కృతజ్ఞతలని చెప్పింది. సంధ్య, దేవి, విజయ తదితర మహిళా కార్యకర్తలకు, తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఆపై "మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు" అన్న కోట్ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.



Sri Reddy
Casting Couch
Renuka Chowdary

More Telugu News