Supreme Court: సుప్రీంకోర్టు భవిష్యత్ పై చర్చించేందుకు.. సీజేఐకు ఓ లేఖ రాసిన సీనియర్ జడ్జిలు!

  • సీజేఐకు లేఖ రాసిన జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్
  • అభిశంసన నోటీసుల తిరస్కరణకు ఒకరోజు ముందు రాసిన లేఖ
  • వ్యవస్థాగత అంశాలు, సుప్రీంకోర్టు భవిష్యత్ పై చర్చించాలి
  • ఫుల్ కోర్టును సమావేశపరచాలని వినతి

సుప్రీంకోర్టు భవిష్యత్ పై చర్చించేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచండంటూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రాకు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్ ఓ లేఖ రాశారు. సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన నిమిత్తం ఇచ్చిన నోటీసుల్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడానికి ఒకరోజు ముందు ఈ లేఖ రాశారు.

వ్యవస్థాగత అంశాలు, సుప్రీంకోర్టు భవిష్యత్ పై చర్చించేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచాలని ఆ లేఖలో కోరారు. కాగా, ఆ రోజున అభిశంసన నోటీసును తిరస్కరించిన కొద్ది సేపటి అనంతరం న్యాయమూర్తుల తేనీటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ లేఖ ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. కాగా, ఫుల్ కోర్టును సమావేశపరచాలని కోరుతూ సీజేఐను మార్చి 21న జస్టిస్ చలమేశ్వర్, ఈ నెల 9న జస్టిస్ కురియన్ జోసఫ్ కోరడం జరిగింది.

  • Loading...

More Telugu News