entertainment: ఆ ట్వీట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు: యాంకర్ రవి వివరణ

  • నా పేరిట ఎవరో ఓ నకిలీ ఐడీని ‘ట్విట్టర్’లో సృష్టించారు
  • నకిలీ ఖాతాలు, ఫాల్స్ న్యూస్ తో జాగ్రత్త!
  • ఇటువంటి విషయాలను ప్రోత్సహించకండి

రెండు, మూడ్రోజుల నుంచి తన పేరిట ఎవరో ఓ నకిలీ ఐడీని ట్విట్టర్ ఖాతాలో సృష్టించి, ట్వీట్స్ చేస్తున్న విషయం తనకు తెలిసిందని, ఆ ట్వీట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ టీవీ యాంకర్ రవి చెప్పాడు.

‘నకిలీ ఖాతాలు, ఫాల్స్ న్యూస్ తో జాగ్రత్త!! ఇటువంటి విషయాలను ప్రోత్సహించకండి’ అంటూ తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘ఈ వీడియోను ఏ అకౌంట్ లో అయితే పోస్ట్ చేశానో, ఇదే నా ఒరిజినల్ ఐడీ.. సో, ప్లీజ్ గమనించండి...థ్యాంక్యూ సో మచ్’ అని ఆ వీడియోలో యాంకర్ రవి చెప్పాడు. అంతేకాకుండా, తన ఒరిజినల్ ‘ట్విట్టర్’ ఖాతా  వివరాలను కూడా పొందుపరిచాడు. 

More Telugu News