charan: విలన్ గా ఎంట్రీ సీన్ లోనే వివేక్ ఒబెరాయ్ అదరగొట్టేశాడట!

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • ఆయన జోడీగా కైరా అద్వాని 
  • విలన్ గా వివేక్ ఒబెరాయ్

చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. చరణ్ బిజీగా ఉండటంతో, ఆయన ప్రమేయంలేని సన్నివేశాలను చిత్రీకరించారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో చరణ్ జాయినయ్యాడు. ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు.

ఇటీవల ఆయన ఎంట్రీ సీన్ ను విజయవాడలో చిత్రీకరించారట. ఎంట్రీ సీన్ లో వివేక్ ఒబెరాయ్ అదరగొట్టేశాడని అంటున్నారు. తాను అనుకున్న దానికంటే ఆ సీన్ బాగా రావడంతో బోయపాటి ఫుల్ ఖుషీ అయ్యాడని అంటున్నారు. వివేక్ ఒబెరాయ్ తన పాత్రలో ఇన్వాల్వ్ అయిన తీరును చూసి బోయపాటి ఎంతగానో అభినందించారట. ఆయన ఎంట్రీ సీన్ కి తప్పకుండా విజిల్స్ పడతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా కైరా అద్వాని చేస్తోన్న సంగతి తెలిసిందే.  

More Telugu News