Telugudesam: ఆనం వివేకానందరెడ్డి మరణం తీరని లోటు: వెంకయ్య, ర‌ఘువీరారెడ్డి, బాలకృష్ణ

  • ఒక మంచి ప్రజానేతను కోల్పోయాం 
  • తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పలువురు
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ప్రముఖ రాజకీయవేత్త, మాజీ మంత్రి ఆనం వివేకానంద రెడ్డి మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్ ర‌ఘువీరారెడ్డి, నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మంచి ప్రజానేతను కోల్పోయామని, ఆయన మరణాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Telugudesam
Andhra Pradesh
Venkaiah Naidu
Congress

More Telugu News