ఆశారాం బాపు అత్యాచారం చేశాడు: తేల్చిన న్యాయమూర్తి
- 2013లో అరెస్టయిన ఆశారాం
- సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితన్న న్యాయమూర్తి
- మిగతా ఐదుగురూ దోషులే
కాగా, ఆశారాం ఓ బాలికను రేప్ చేశాడన్న ఆరోపణలతో 2013లో అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, ఆయన్ను జైలుకు తరలించగా, అప్పటి నుంచి ఆశారాం జైల్లోనే ఉన్నాడన్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఐదు రాష్ట్రాల్లో బలమైన నెట్ వర్క్ ను కలిగున్న ఆశారాంకు శిక్ష పడ్డ తరువాత విధ్వంసాలు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 30 వరకూ పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. బాధిత బాలిక ఇంటి వద్ద బలగాలను పెంచారు.