suddala ashok teja: మా నాన్న కొట్టాడు .. అప్పటి నుంచి అలా చేయలేదు: సుద్దాల అశోక్ తేజ

  • స్కూల్ ఎగ్గొట్టి గుట్టల్లో ఆడుకునేవాడిని
  • చెరువులో ఈత కొడుతూ గడిపేవాడిని 
  • మా నాన్నకి ఆ సంగతి తెలిసింది
పాటల రచయితగా .. ముఖ్యంగా పల్లెదనానికి అద్దం పట్టే పాటలతో సుద్దాల అశోక్ తేజ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన బాల్యంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. " మా ఊరి దగ్గర గుట్టలు వున్నాయి. మేం స్కూల్ కి వెళతామని చెప్పి వెళ్లి ఆ గుట్టల్లో ఆడుకునే వాళ్లం. తీసుకెళ్లిన అన్నమక్కడే తినేసి చెరువులో ఈత కొట్టేవాళ్లం"

"ఆ తరువాత అలసిపోయినట్టుగా నటిస్తూ .. అప్పుడే స్కూల్ నుంచి వస్తున్నట్టుగా ఇంటికి వెళ్లే వాళ్లం. ఒకసారి మేమంతా గుట్టల్లో ఆడుకుంటూ ఉండగా .. మా నాన్నేమో స్కూల్ కి వెళ్లాడు. నేను స్కూల్ కి సరిగ్గా రావడం లేదని అక్కడ ఆయనకి తెలిసింది. ఆయన ఇంటికి వచ్చేసిన తరువాత .. నేను ఇంటికి వెళ్లాను. ఎక్కడి నుంచి వస్తున్నావురా అంటే .. స్కూల్ నుంచి అన్నాను. అంతే, మా నాన్న నన్ను బాగా కొట్టాడు .. ఇకపై అట్లా చేయనని చెప్పాను .. చేయలేదు కూడా" అని చెప్పుకొచ్చారు.      
suddala ashok teja

More Telugu News