SRI REDDY: 'మెంటల్ పేషంట్'నని ఒప్పుకోవాలన్న శ్రీరెడ్డి.. ఫేస్ బుక్ లో తాజా పోస్టు

  • పేరు ప్రస్తావించకుండా విమర్శిస్తున్న శ్రీరెడ్డి 
  • ఇది ఖచ్చితంగా పారానాయిడ్‌ పర్సనాలిటీ డిజార్డర్‌
  • వైరల్ అవుతున్న పోస్ట్   

నిన్న మొన్నటి వరకు నేరుగా పేర్లు చెప్పి వ్యాఖ్యలు చేసిన సినీ నటి శ్రీరెడ్డి ఇప్పుడు రూటు మార్చింది. ఎవరి పేరూ ప్రస్తావించకుండా, ఫేస్ బుక్ లో మానసిక వ్యాధిగ్రస్తుడంటూ వ్యాఖ్యలు చేసింది. ‘ఇది ఖచ్చితంగా పారానాయిడ్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ (పీపీడీ) అనే మానసిక వ్యాధి. దీనికి ‘ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు వ్యాధిగ్రస్తుడినని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్  ప్రకారం ఆ మానసిక వ్యాధి లక్షణాల వివరాల్లోకి వెళ్తే...
*ఆధారాలేమి లేకుండా అనుమానాలు అపనమ్మకాలలో మునిగిపోవడం.
*ఆత్మనూన్యతా భావంతో చిన్న చిన్న విషయాలకి కూడా భరించలేని అవమానం ఫీల్ అవ్వడం.
*తాను నమ్మే వాటి నిర్ధారణ కోసం తన కళ్ళకి మాత్రమే కనిపించే క్లూలని ఊహించుకోవడం.
* లేని శత్రువుల నుంచి తనకేదో వాళ్ళనుంచి ప్రమాదం ఉందనుకునే భ్రమలో కూరుకుపోయి లేదని ప్రూవ్ చేసినా అర్ధమయ్యే శక్తి కోల్పోవడం.
* మీనింగ్ ఫుల్ భావోద్వేగాల్ని కోల్పోవడం వల్ల స్కిజాయిడ్ ఐసోలేషన్ (Schizoid isolation) అనబడే ఒంటరి తనం కోరుకునే ఇంకొక మెంటల్ ప్రాబ్లెమ్ కి లోనవడం.
* అకారణంగా పగల్ని ప్రతీకారాల్ని పెంచుకుని ఎవరేం చేసినా తనని తొలగించటానికే ప్లాన్ చేస్తున్నారని అనుకోవడం..
అంటూ ఆమె పేర్కొంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

  • Loading...

More Telugu News