allu shirish: దుల్కర్ సల్మాన్ కి హిట్ ఇచ్చిన మూవీ రీమేక్ లో అల్లు శిరీశ్

  • మలయాళంలో హిట్ కొట్టిన 'ఏబీసీడీ'
  • దుల్కర్ కి స్టార్ డమ్ తెచ్చిన మూవీ 
  • తెలుగు రీమేక్ దర్శకుడిగా సంజీవ్ పరిచయం 

'ఒక్క క్షణం' ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ కాకపోవడంతో, మంచి కథ కోసం అల్లు శిరీశ్ అన్వేషిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు .. ఇది ఒక మలయాళ సినిమాకి రీమేక్. ఆ మధ్య మలయాళంలో దుల్కర్ సల్మాన్ 'ఏబీసీడీ' అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆయనకి సక్సెస్ తో పాటు స్టార్ డమ్ ను కూడా తెచ్చిపెట్టింది.

 ఒక రిచ్ ఎన్నారై .. ఇండియాకి వచ్చి, చాలా సాధారణమైన జీవితాన్ని గడపాలనుకుంటాడు. అప్పుడతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది. ఈ రీమేక్ ద్వారా దర్శకుడిగా సంజీవ్ పరిచయం అవుతున్నాడు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి .. ఇదే సంవత్సరంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.    

More Telugu News