Twitter: వాళ్లంతా స్పందించేందుకు చాలినంత టైమిస్తా!: పవన్ కల్యాణ్

  • కొందరు నన్ను లక్ష్యం చేసుకున్నారు 
  • టీడీపీ నడిపిస్తున్న మీడియా సంస్థలకు నోటీసులు
  • యాజమాన్యాలు, వాటాదారులకు కూడా
  • ట్విట్టర్ లో వెల్లడించిన పవన్ కల్యాణ్

తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. "తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్న మీడియా చానళ్లకు, వాటి అధినేతలకు, వాటిల్లో వాటాదారులకు, బోర్డు సభ్యులకు మేము లీగల్ నోటీసులు పంపనున్నాము. మేము ఇచ్చే నోటీసులపై స్పందించేందుకు వారికి చాలినంత సమయం ఇస్తాం" అని అన్నారు.

కాగా, తెలుగు టీవీ చానళ్లు టీవీ 9, ఏబీఎన్, టీవీ 5లపై పవన్ కల్యాణ్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చానళ్లలో తనకు వ్యతిరేకంగా చర్చలు పెడుతున్నారని, కొంతమందితో కావాలనే తనపై విమర్శలు చేయించి, వాటిని పదేపదే టీవీల్లో చూపుతున్నారని పవన్ ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News