YSRCP: బీజేపీ నుంచి వైసీపీలోకి భారీ వలసలు... కన్నాతో పాటు కావూరి, కాటసాని కూడా!

  • బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత
  • రాజకీయ భవిష్యత్తు కష్టమని భావిస్తున్న నేతలు
  • వైసీపీలోకి మారిపోతున్న నేతలు

ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం వంటి విభజన హామీల అమలుకు ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు కష్టమేనని భావిస్తున్న పలువురు రాష్ట్ర నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

రేపు జగన్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించుకోగా, ఆయన దారిలో కావూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కూడా పయనించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాటసాని ఈనెల 29న వైసీపీలో చేరుతారని తెలుస్తుండగా, కావూరి చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఈలోగానే అంటే 27వ తేదీన జగన్ సమక్షంలో మరో నేత వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరనున్నారన్న సంగతి తెలిసిందే.

More Telugu News