sukumar: భారీగా పెరిగిన సుకుమార్ రెమ్యునరేషన్.. మహేష్ సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే..!

  • వరుస హిట్లతో ఫుల్ జోష్ లో సుకుమార్
  • రంగస్థలం హిట్ తో పెరిగిన డిమాండ్
  • మహేష్ సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్

వరుస హిట్లతో లెక్కల మాస్టారు సుకుమార్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. సినిమా సినిమాకు తన గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా విడుదలైన 'రంగస్థలం' సినిమా సూపర్ హిట్ కావడంతో సుకుమార్ డిమాండ్ మరింత పెరిగింది. త్వరలోనే మహేష్ బాబుతో కలసి సుకుమార్ ఓ భారీ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ సినిమకు సుకుమార్ ఏకంగా రూ. 15 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. 

  • Loading...

More Telugu News