Sachin Tendulkar: ఆదర్శ సచిన్... అందుకో శుభాకాంక్షలు: చంద్రబాబునాయుడు

  • నేడు సచిన్ పుట్టిన రోజు
  • 45వ బర్త్ డే వేడుకల్లో టెండూల్కర్
  • ట్విట్టర్ లో విషెస్ చెప్పిన చంద్రబాబు

నేడు 45వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. "క్రికెట్ మైదానంలో అయినా, జీవితంలో అయినా సగౌరవంగా, సమగ్రంగా, గర్వపడే స్థాయిలో కొనసాగారు. ఐకానిక్ సచిన్ రమేష్ టెండూల్కర్ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు" అని ట్వీట్ పెట్టారు.

కాగా, తన 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌ తో జరిగిన మ్యాచ్‌ ద్వారా క్రికెట్ లో అరంగేట్రం చేసిన సచిన్, క్రమంగా ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. 100 సెంచరీలతో అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు సాధించిన సచిన్, 2013లో క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News