Vijay: 'భరత్ అనే నేను' రీమేక్ కు ఎక్కడ లేని డిమాండ్... చూడాలనుకుంటున్న రజనీకాంత్!

  • సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతున్న చిత్రం
  • తమిళంలో రీమేక్ చేయాలన్న ఆలోచనలో నిర్మాతలు
  • ఆసక్తితో ఉన్న విజయ్
గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా దూసుకెళుతున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను', రీమేక్ హక్కుల కోసం డిమాండ్ పెరిగింది. హామీ ఇస్తే నిలబెట్టుకోవాలన్న కథాంశంతో పాటు, సీఎం పాత్ర, రాజకీయ నేపథ్యం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలో సైతం తంబీలకు బాగా నచ్చిన నేపథ్యంలో, దీన్ని రీమేక్ చేయాలని పలువురు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రాన్ని చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తుండగా, స్టార్ హీరో విజయ్ కూడా 'భరత్ అనే నేను'పై ఆసక్తితో ఉన్నట్టు సమాచారం. ఇక ఓ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ చిత్రం హక్కులను ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Vijay
Bharath Ane Nenu
Mahesh Babu
Rajanikant
Tollywood
Tamilnadu

More Telugu News