NTR: బాల ఎన్టీఆర్ లుగా దేవాన్ష్, శౌర్యారామ్!

  • వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ కు ఎన్టీఆర్ బయోపిక్
  • ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో దేవాన్ష్
  • యువ ఎన్టీఆర్ గా కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్యారామ్

వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న దివంగత నేత ఎన్టీఆర్ బయోపిక్ లో బాల ఎన్టీఆర్ లుగా నారా, నందమూరి వంశాల వారసుడు, లోకేష్ కుమారుడు దేవాన్ష్ తో పాటు, కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్యారామ్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్న చిత్రంలో బాల ఎన్టీఆర్ గా దేవాన్ష్, యువ ఎన్టీఆర్ గా శౌర్యారామ్ కనిపిస్తారని సమాచారం.

తొలుత యువ ఎన్టీఆర్ పాత్రకు మోక్షజ్ఞను ఎంపిక చేయాలని చిత్ర దర్శకుడు తేజ భావించినా, బాలయ్య సున్నితంగానే తిరస్కరించినట్టు తెలుస్తోంది. సోలో హీరోగా తీసే సినిమాతోనే మోక్షజ్ఞ తెరంగేట్రం ఉండాలని భావిస్తున్న బాలయ్య, ఈ సినిమాలో వద్దని తేజకు స్పష్టం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మించాలని కూడా వీరిద్దరూ అనుకుంటున్నట్టు తెలుస్తున్నా, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

More Telugu News