Karnataka: యడ్యూరప్పకు ఊహించని షాకిచ్చిన బీజేపీ!

  • అసెంబ్లీ సీట్ల కేటాయింపులో యడ్యూరప్పకు షాక్ మీద షాక్
  • యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు టికెట్ నిరాకరణ
  • సన్నిహితురాలు శోభ కరంద్లాజేకు మొండిచెయ్యి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఆ పార్టీ ఊహించని షాక్‌ ఇచ్చింది. త్వరలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండో కుమారుడు బి.వై.విజయేంద్ర పోటీ చేస్తారని, సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర మీద వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆ నియోజకవర్గం పోరు రసవత్తరంగా ఉండనుందంటూ మీడియా కథనాలు ప్రసారం చేసింది. దీంతో యడ్యూరప్ప కుమారుడి పోటీకి సర్వం సిద్ధం అనుకుంటున్న దశలో ఆయనకు చెక్ చెబుతూ, ఆయన కుమారుడికి సీటివ్వడం లేదని పార్టీ అధిష్ఠానం తేల్చిచెప్పింది.

 దీనిపై యడ్యూరప్ప ప్రకటన చేస్తూ, తన కుమారుడు వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని, అక్కడ సామాన్య కార్యకర్తకు అవకాశం ఇస్తున్నామని అన్నారు. దీంతో విజయేంద్ర వర్గం ఆగ్రహంతో రగిలిపోయింది. ఆయన అనుచరులు పార్టీ కార్యాలయంలో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కుర్చీలు ధ్వంసం చేశారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీలు ఝళిపించారు. యడ్యూరప్పకి ఇలా ఊహించని షాక్ తగిలిందని భావిస్తుండగానే.. ఆయన సన్నిహితురాలు శోభ కరంద్లాజేకు కూడా పార్టీ టికెట్‌ నిరాకరించింది. దీంతో ఆయన వర్గానికి మరోషాక్ తగిలినట్టైంది. 

More Telugu News