britain: బ్రిటన్ రాజ కుటుంబంలో సంబరాలు.. కేట్ దంపతులకు మూడోబిడ్డ

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కేట్ మిడిల్టన్
  • తల్లీ బిడ్డ క్షేమం.. శిశువు బరువు మూడున్నర కిలోలు
  • ఓ ప్రకటన విడుదల చేసిన కెన్సింగ్ టన్ ప్యాలెస్

బ్రిటన్ యువరాజు విలియమ్, యువరాణి కేట్ మిడిల్టన్ దంపతులకు మూడో సంతానం కలిగింది. బ్రిటన్ కాలమానం ప్రకారం ఉదయం 11.01 గంటలకు పండంటి మగబిడ్డకు కేట్ జన్మనిచ్చింది. ఈ మేరకు కెన్సింగ్ టన్ ప్యాలెస్ ఓ ప్రకటన చేసింది. తల్లీబిడ్డ క్షేమమని, పుట్టిన బిడ్డ బరువు మూడున్నర కిలోలు ఉన్నట్లు తెలిపింది.

మగబిడ్డకు ఏ పేరు పెట్టేది నిర్ణీత సమయంలో ప్రకటిస్తామని పేర్కొంది. విలియమ్-కేట్ దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయాన్ని సంబంధీకులందరికీ తెలియజేశామని, సంతోషం వ్యక్తం చేశారని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, బ్రిటన్ రాజకుటుంబంలోకి మరో వారసుడు రావడంతో వారు సంబరాల్లో మునిగిపోయారు. విలియమ్-కేట్స్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లు ప్రిన్స్ జార్జి (4), ప్రిన్సెస్ చార్లెట్ (3). 

More Telugu News