vishnu kumar raju: 2019లో టీడీపీ ఔట్.. విశాఖలో జగన్ ను కలుస్తా: విష్ణుకుమార్ రాజు

  • పట్టిసీమ అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం
  • మే 15 తర్వాత విషయాలన్నీ బయటకు వస్తాయి
  • కేంద్రం నిధులు ఇస్తామంటున్నా.. రాష్ట ప్రభుత్వం తీసుకోవడం లేదు
దమ్ముంటే కేసులు పెట్టాలంటూ కొందరు టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారని... త్వరలోనే వారి కోరిక తీరుస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మే 15వ తేదీ తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు.

రూ. 9,300 కోట్లను ఏపీకి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని... కానీ, టీడీపీ ప్రభుత్వం తీసుకోవడం లేదని విష్ణు కుమార్ రాజు విమర్శించారు. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నం చేరుకున్నాక... తన మామగారి కోసం ఆయనను కలుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
vishnu kumar raju
cbi
pattiseema

More Telugu News