యెడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలు శోభకు అధిష్ఠానం షాక్
- 225 స్థానాలకు గాను 219 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
- శోభ కరంద్లాజేకు దక్కని టికెట్
- ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఎంపీ
ప్రస్తుతం ఆమె చిక్కంగలూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె ఎంతో పట్టుదలగా ఉన్నారు. అంతేకాదు, పార్టీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో శోఖ ఉన్నారు. జగదీష్ శెట్టర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో, తుది జాబితాలో అయినా ఆమెకు టికెట్ లభిస్తుందా? లేదా? అనే విషయంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది.