lavanya tripathi: లావణ్య త్రిపాఠి ట్వీట్ కి బ్రహ్మాజీ సరదా జవాబు!

  • అప్పుడప్పుడూ వచ్చే ఆలోచనలు అంటూ ట్వీట్ చేసిన లావణ్య త్రిపాఠి
  • కళను ప్రేమించండి అంటూ ట్వీట్ చేసిన లావణ్య 
  • సరే లవ్యూ అన్న బ్రహ్మాజీ
ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సీనియర్ నటుడు బ్రహ్మాజీ ‘సరే.. లవ్‌ యూ’ అని చెప్పగా, తను నవ్వుతూ మురిసిపోయినట్టు ఎమోజీలు పెట్టింది. ఈ సరదా ట్వీట్ వివరాల్లోకి వెళ్తే... లావణ్య తన ఖాతాలో 'అప్పుడప్పుడూ వచ్చే ఆలోచనలు' అంటూ ఒక పోస్ట్‌ చేసింది.

అందులో ‘కళను, కళాకారుడ్ని కలపకండి. కళ కారణంగా కళాకారుడ్ని ప్రేమించండి. కానీ కళాకారుడి కారణంగా కళను ద్వేషించకండి’ అంటూ ట్వీట్ చేసింది. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీనికి సమాధానంగా బ్రహ్మాజీ తన స్టైల్ లో ‘సరే.. లవ్‌ యూ..’ అన్నారు. దానికి ఎమోజీలతో లావణ్య సమాధానమిచ్చింది. 
lavanya tripathi
brahmaji
Tollywood

More Telugu News