koratala: 'అందరికీ ధన్యవాదాలు' అంటోన్న కొరటాల

  • రికార్డులు సృష్టోస్తోన్న 'భరత్ అనే నేను'
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన మహేశ్ 
  • సంతోషంతో పొంగిపోతోన్న కొరటాల

'భరత్ అనే నేను' విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లను సాధించలేదనే టాక్ వినిపిస్తోంది. మహేశ్ ను .. కొరటాలను అభిమానులు .. సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దాంతో ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల మహేశ్ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

తాజాగా కొరటాల కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సినిమాకి ఈ స్థాయిలో లభిస్తోన్న ఆదరణ తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ట్విట్టర్ ద్వారా కొరటాల తెలియజేశాడు. తమ ప్రయత్నాన్ని ప్రశంసిస్తోన్న వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాకి ముందు మహేశ్ నుంచి రెండు ప్లాపులు వచ్చాయి. దాంతో కొరటాలపై మరింతగా ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఆ ఒత్తిడిని అధిగమిస్తూ విజయాన్ని అందుకున్న ఆయన, ఆనందంతో పొంగిపోతున్నాడు.    

More Telugu News