milind soman: టాప్ మోడల్ పెళ్లిపై నెటిజన్ల తమాషా కామెంట్లు!

  • ప్రేయసిని వివాహం చేసుకున్న సూపర్ మోడల్ మిలింద్ సోమన్
  • సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు 
  • చిత్రంగా స్పందించిన నెటిజన్లు
మాజీ సూపర్‌ మోడల్‌, నటుడు మిలింద్‌ సోమన్‌ 52 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకయ్యాడు. గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న ప్రేయసి అంకితా కోన్వర్‌ (27) ను ముంబై, అలీబౌగ్‌ లోని రిసార్ట్స్‌ లో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో మిలింద్ పోస్టు చేశాడు.

దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ స్పందించారు. ఆఖరుకి ‘మిలింద్‌ కి, అంకితకు పెళ్లైంది. నేను మాత్రం ఒంటరిగా ఉంటూ చచ్చిపోయేలా ఉన్నాను’ అంటూ ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో నెటిజన్ ‘మొదటిసారి వీరిద్దరినీ చూసినప్పుడు అతను పాపని దత్తత తీసుకున్నాడనుకున్నా’ అంటూ వారి పెళ్లిపై సెటైర్ వేశాడు. మరికొందరు వారిద్దరూ ‘తండ్రీకూతుళ్లలా ఉన్నారు’ అంటూ కామెంట్ చేశారు.
milind soman
ankita konwar
mumbai
marriege

More Telugu News