టాలీవుడ్ లో లైట్ మెన్ల మెరుపు సమ్మె.. షూటింగ్స్ బంద్

  • వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ లైట్ మెన్ల మెరుపు సమ్మె
  • 35 శాతం పెంచాలని డిమాండ్
  • 25 శాతం పెంచుతామంటున్న నిర్మాతలు
తెలుగు సినీ పరిశ్రమలో లైట్ మెన్లు మెరుపు సమ్మెకు దిగారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వీరు సమ్మెకు దిగారు. వేతనాలతో పాటు పలు సమస్యల పరిష్కారానికి వారు మెరుపు సమ్మె చేపట్టారు. దీంతో టాలీవుడ్‌ లో వివిధ సినిమాల షూటింగ్‌ లు ఆగిపోయాయి.

లైట్ మెన్లకు ఇస్తున్న వేతనాలను 25 శాతం పెంచేందుకు నిర్మాతలు సంసిద్ధత వ్యక్తం చేసినా వారు ఆందోళన విరమించలేదు. తమ వేతనాలను 35 శాతం పెంచాలని లైట్ మెన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారానికి ఫిలిం ఛాంబర్ రంగంలోకి దిగింది.  
Go Back to Shorts
Tollywood
light mens
bandh
strike

More Telugu News