amith sha: మహిళల రక్షణకు బీజేపీ సర్కారు చర్యలు తీసుకుంటుంది: అమిత్ షా

  • పోస్కోను మరింత పటిష్ఠం చేసేందుకు మోదీ సర్కారు చర్యలు తీసుకుంది
  • మహిళా భద్రత, సాధికారతకు కట్టుబడి ఉన్నాం
  • మహిళలకు మరుగుదొడ్లు, ఎల్పీజీ కనెక్షన్లు ఇప్పించాం

బాలికలపై అత్యాచారాలు జరిపిన రేపిస్టులకు మరణదండన విధించడంతో పాటు బాలలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని (పోస్కో) మరింత పటిష్ఠం చేసేందుకు మోదీ సర్కారు చర్యలు తీసుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు.  కథువా, ఉన్నావో ఘటనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నిర్వహించిన బీజేపీ మహిళా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో మహిళల భద్రత, సాధికారత కోసం బీజేపీ సర్కారు చర్యలు తీసుకుంటుందని అన్నారు. మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు ఎల్పీజీ కనెక్షన్లు కూడా ఇచ్చిందని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News