vijay devarakonda: 'అర్జున్ రెడ్డి' సీక్వెల్ గురించి విజయ్ దేవరకొండ

  • సంచలన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' 
  • సీక్వెల్ గురించిన టాక్ 
  • చర్చలు జరిగాయన్న విజయ్ దేవరకొండ  
తెలుగులో ఆ మధ్య వచ్చిన 'అర్జున్ రెడ్డి' ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది .. సంచలన విజయం సాధించింది. ఈ సినిమా యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమా సీక్వెల్ గురించిన వార్త ఒకటి తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ విషయాన్ని గురించిన ప్రస్తావన విజయ్ దేవరకొండ దగ్గర రావడంతో ఆయన స్పందించాడు.

'అర్జున్ రెడ్డి' సీక్వెల్ ను గురించి సందీప్ రెడ్డి నాతో మాట్లాడారు. 40 యేళ్లు వచ్చిన తరువాత 'అర్జున్ రెడ్డి' వ్యవహారశైలి ఎలా వుంటుందనే విషయం చెబితే బాగుంటుందనేది నా అభిప్రాయం' అన్నాడు. ఒక వైపున చరణ్ తోను .. మరో వైపున మహేశ్ తోను సినిమాలు చేయడానికి దర్శకుడు సందీప్ రెడ్డి గట్టి కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో 'అర్జున్ రెడ్డి ' సీక్వెల్ ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళతాడో చూడాలి మరి.          
vijay devarakonda
sandeep

More Telugu News