ramya nambisan: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంప్రదాయం ఉంది: రమ్య నంబీశన్

  • సినీ రంగంలో అవకాశాలివ్వడంలో సెక్సువల్ ఫేవర్ ఆశిస్తారు 
  • అలాంటి ఘటనలు నాకు ఎదురుపడలేదు 
  • మహిళా నటులు దీనిపై ధైర్యంగా పోరాడాలి

చలన చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ సంప్రదాయం ఉందని కోలీవుడ్ నటి రమ్య నంబీశన్ స్పష్టం చేసింది. 'పిజ్జా', 'సేతుపతి' సినిమాలతో మంచి నటిగా పేరుతెచ్చుకున్న ఈ భామ తాజాగా ప్రభుదేవాతో 'మెర్క్యురీ' సినిమాతో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎదురైన ప్రశ్నలకు సమాధానమిస్తూ, చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులకు లైంగిక వేధింపులు ఎదురవడం నిజమేనని చెప్పింది.

పేరు వేరైనా క్యాస్టింగ్ కౌచ్ అన్నది అన్ని రంగాల్లోనూ ఉందని ఆమె అభిప్రాయపడింది. సినీ రంగంలో అవకాశాల పేరుతో సెక్సువల్ ఫేవర్ ఆశిస్తారని చెప్పింది. తనకు అలాంటి ఘటనలు ఎదురుకానప్పటికీ, పలువురు సహనటులు చెప్పగా విన్నానని తెలిపింది. వీటిని అడ్డుకోవాలని, ఇలాంటి సంప్రదాయంపై మహిళా నటులు ధైర్యంగా పోరాడాలని రమ్య నంబీశన్ పిలుపునిచ్చింది. 

  • Loading...

More Telugu News