cpm: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సీతారాం ఏచూరి

  • సీతారాం ఏచూరి ఎన్నిక ఏకగ్రీవం
  • ఆ పదవిని వరుసగా రెండోసారి దక్కించుకున్న ఏచూరి
  • పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ కూడా ఎంపిక

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నికయ్యారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఈరోజు జాతీయ మహాసభల వేదికపై పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, వీరయ్యలు ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణ కేంద్ర కమిటీకి నాగయ్యకు అవకాశం లభించింది.

కాగా, జాతీయ మహాసభల ముగింపు వేడుక ఈ రోజు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మలక్ పేట నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతును ప్రారంభించనున్నారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతులో 20 వేల మంది పాల్గొంటారని సమాచారం. సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుంది. సభా ప్రాంగణంలో, ఎల్బీనగర్ చౌరస్తాలో 12 ఎల్ ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News