CENTRAL MINISTER: అత్యాచారాలను ఆపలేం.. ఒకటి రెండు జరిగితే రాద్ధాంతం చేయరాదు: కేంద్ర మంత్రి గంగ్వార్

  • ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండింటిని అంత పెద్దవిగా చూపకూడదు
  • ఈ తరహా ఘటనలు దురదృష్టకరం
  • అయినా వాటిని అన్ని వేళలా ఆపలేం  
కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇంత పెద్ద దేశంలో ఏవో ఒకటి రెండు అత్యాచార కేసులు జరిగితే వాటిని మరీ అంత పెద్దవి చేసి రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

‘‘ఈ ఘటనలు (అత్యాచారాలు) దురదృష్టకరం. అయినప్పటికీ కొన్ని సమయాల్లో మనం వాటిని ఆపలేం. ప్రభుత్వం అంతటా అప్రమత్తతతోనే ఉంటోంది. దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు అత్యాచారాలు జరిగితే వాటిని అంత పెద్దవి చేయకూడదు’’ అని గంగ్వార్ మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు.

దీంతో మంత్రి వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మరోవైపు చిన్నారులపై అత్యాచార ఘటనలను కేంద్రం తీవ్రంగా పరిగణించి నిందితులకు ఉరిశిక్ష విధించేలా చట్టంలో సవరణలతో ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన విషయం విదితమే.
CENTRAL MINISTER
GANGWAR

More Telugu News