huawei p20: ఈ నెల 24 నుంచి హువావే పి20 స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు... అమేజాన్ ఇండియాలో!

  • పి20ప్రో లో ట్రిపుల్ కెమెరాలు
  • ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే
  • 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ

హువావే కంపెనీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పి20 సిరీస్ ఫోన్ల విక్రయాలు ఈ నెల 24 నుంచి అమేజాన్ డాట్ ఇన్ లో ప్రారంభం కానున్నాయి. గత నెల ఈ ఫోన్లను పారిస్ లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లు త్వరలోనే రానున్నాయనే నోటిఫికేషన్ అమేజాన్ డాట్ ఇన్ లో కనిపిస్తోంది.

పి20 ప్రో ఫోన్ లో 6.1 అంగుళాల డిస్ ప్లే ఉంటే, పి20 లైట్ 5.84 అంగుళాల డిస్ ప్లేతో ఉంటుంది. ఈ రెండూ ఫుల్ హెచ్ డీ ప్లస్ ఫుల్ వ్యూ డిస్ ప్లేలు. పి20 ప్రో ఫోన్ హైసిలికాన్ కిరిన్ 970 ఎస్వోసీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తే, పి20 లైట్ మోడల్ హైసిలికాన్ కిరిన్ 659 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో రానుంది. పి20 ప్రోలో ట్రిపుల్ (మూడు) కెమెరాలు ఉంటాయి. 8 మెగా పిక్సల్, 40 మెగాపిక్సల్, 20 మెగాపిక్సల్ సెన్సార్ కాంబినేషన్ తో ఉండడం అరుదైనదే. పి20 లైట్ లో మాత్రం డ్యుయల్ కెమెరాలు ఉంటాయి.

More Telugu News