ram gopal varma: హేయ్ పవన్.. ఐదేళ్ల క్రితమే అందరూ చూసినదాన్ని ఇప్పుడు నీవు చూపిస్తున్నావ్: రామ్ గోపాల్ వర్మ

  • రవిప్రకాశ్ వీడియో కొత్తదేమీ కాదు
  • ఐదేళ్ల క్రితం నాటిది
  • నీ పక్కనున్న వ్యక్తులను పక్కన పెట్టేయ్
తన తల్లి మీద వేసిన ఒట్టును తీసి గట్టు మీద పెడుతున్నానని ప్రకటించిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లతో విరుచుకుపడుతున్నాడు. టీవీ9 రవిప్రకాశ్ కాళ్లను ఓ వ్యక్తి పట్టుకున్న 16 సెకన్ల నిడివి గల ఓ వీడియోను పవన్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దీని గురించి వర్మ ట్వీట్ చేస్తూ... "హేయ్ పవన్ కల్యాణ్... ఈ వీడియో కొత్తదేమీ కాదు. ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి వీడియో. లక్షల సార్లు ఈ వీడియో ఇప్పటికే సర్క్యులేట్ అయింది. నువ్వు చూడడం మాత్రం తొలిసారేమో. దాని గురించి ఇప్పటికే అతను వివరణ కూడా ఇచ్చాడు. ఈ వీడియోను నీకు ఇచ్చిన ఇడియట్స్ ను వెంటనే పక్కన పెట్టేయ్. వీళ్లంతా పవనిజం వెనకున్న ఇడియట్ రాజు రవితేజ కంటే కూడా నీకు ప్రమాదకారులు" అని అన్నారు. ఇది ఐదేళ్లనాటి వీడియో అనే విషయం అందరికీ తెలుసని... వీడియోలోని ఘటన ఎవరికీ తెలియదంటూ మీ మనుషులు అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ram gopal varma
Pawan Kalyan
tweet
tv9
raviprakash

More Telugu News