Mahesh Babu: కొరటాల .. మహేశ్ లకు సినీ ప్రముఖుల ప్రశంసలు

  • కొరటాల ప్రయత్నం పట్ల అభినందనలు 
  • మహేశ్ నటనకు ప్రశంసలు 
  • మిగతా ప్రముఖుల నుంచి ట్వీట్ల వెల్లువ

మహేశ్ బాబు హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా ప్రాంతాల్లోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా పట్ల మహేశ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

 రాజమౌళి .. వంశీ పైడిపల్లి .. శ్రీను వైట్ల .. హరీశ్ శంకర్ .. వెంకీ అట్లూరి .. తమన్ .. కల్యాణ్ రామ్ .. నిఖిల్ .. రకుల్ ఈ సినిమా బాగుందంటూ ప్రశంసించారు. కథాకథనాలను కొరటాల నడిపించిన తీరు పట్ల, సమాజాన్ని పట్టిపీడిస్తోన్న సమస్యలకు పరిష్కారాలు చూపిన తీరు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'భరత్' పాత్రలో మహేశ్ చాలా అద్భుతంగా నటించాడంటూ అభినందనలు తెలియజేశారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇంకా చాలామంది సినీ ప్రముఖులు వరుస ట్వీట్స్ చేస్తుండటం విశేషం.     

More Telugu News