క్రికెటర్ నోట బాలయ్య బాబు డైలాగ్!

21-04-2018 Sat 16:13
  • రెడ్ ఎఫ్ ఎమ్ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెటర్లు
  • 'డొంట్ ట్రబుల్ ద ట్రబుల్' డైలాగ్ చెప్పిన అలెక్స్ హేల్స్
  • చప్పట్లతో అభినందించిన సహచరులు

ఐపీఎల్ సీజన్-11 కు ప్రాచుర్యం కల్పించేందుకు ఫ్రాంఛైజీలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ అభిమానులను ప్రత్యేక రైలులో పూణేకు తరలించగా, సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు హైదరాబాదులో ఆటగాళ్లతో 'రెడ్ ఎఫ్ ఎం' 93.5 ద్వారా అభిమానులతో మాటామంతి ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో సన్ రైజర్స్ హైదరాబాదు ఆటగాడు అలెక్స్ హేల్స్ టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ సినిమాలోని 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' డైలాగ్ చెప్పి అందర్నీ అలరించాడు. ఏమాత్రం తడబడకుండా డైలాగ్ చెప్పడంతో సహచరులు చప్పట్లతో హేల్స్ ను అభినందించారు.