hemamalini: అత్యాచారాలు గతంలోనూ జరిగాయి... వాటి గురించి ఎవరికీ తెలియదు!: హేమా మాలిని

  • మహిళలు, చిన్నారులపై గతంలో అనేక దాడులు జరిగాయి
  • చైతన్యం పెరగడంతో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి
  • ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది
అత్యాచారాలు గతంలో కూడా జరిగాయని, అయితే జనాల్లో పెరిగిన చైతన్యం వల్ల ఇప్పుడు వెలుగు చూస్తున్నాయని ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధురలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దాడులు గతంలో అనేకం జరిగాయని, అయితే వాటి గురించి ఎవరికీ తెలియదని ఆమె చెప్పారు.

ఇలాంటి ఘటనలు జరగకూడదని పేర్కొన్నారు. జరిగిన ఘటనలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల వల్ల దేశానికి చెడ్డపేరు వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
hemamalini
mp
actress

More Telugu News