raviteja: 'నేల టిక్కెట్టు' టీజర్ రెడీ .. రేపే రిలీజ్

  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు'
  • రవితేజ సరసన మాళవిక శర్మ 
  • మే నెల చివరిలో విడుదల  

రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పరంగా ముగింపు దశకి చేరుకుంది. రవితేజ సరసన మాళవిక శర్మ కథానాయికగా కనిపించనుంది. వచ్చేనెల చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

 ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు (ఆదివారం) ఉదయం 9 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టీజర్ తో ఈ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చే దిశగా జాగ్రత్తలు తీసుకున్నారట. మాస్ టైటిల్ తో మాస్ మహారాజ్ ను రంగంలోకి దింపుతోన్న కల్యాణ్ కృష్ణ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇంతవరకూ చేసిన రెండు సినిమాలతో హిట్స్ కొట్టిన కల్యాణ్ కృష్ణ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.        

  • Loading...

More Telugu News