Pawan Kalyan: 24 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన!: పవన్ కు జర్నలిస్ట్ సంఘాల హెచ్చరిక

  • పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న జర్నలిస్టులు
  • జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతిన్నాయి
  • ప్రజాస్వామ్య విరుద్ధ వ్యాఖ్యలు పవన్ చేశారు
  • జర్నలిస్టు సంఘాల నేత చలపతిరావు
కొన్ని తెలుగు వార్తా చానళ్లను నిషేధించాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంపై మండిపడుతున్న జర్నలిస్టు సంఘాలు ఈ ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టు నేతలు, 24 గంటల్లో పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయడం తగదని, పవన్ వ్యాఖ్యలతో జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతిన్నాయని సంఘాల నేత చలపతిరావు వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. మీడియా మొత్తానికి ఆయన క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పవన్ నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరిస్తామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. కాగా, నిన్నటి పవన్ వ్యాఖ్యల తరువాత ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా వాహనాలను జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan
Journalists
ABN
Vijayawada

More Telugu News