Tollywood: అన్నపూర్ణ స్టూడియోస్ లో వాడీవేడిగా సాగుతున్న సమావేశం!

  • టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పై చర్చిస్తున్న పెద్దలు
  • హాజరైన పలువురు ప్రముఖులు
  • సమావేశం అనంతరం సచివాలయంలో మరో సమీక్ష
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై జరుగుతున్న రాద్ధాంతంపై చర్చించేందుకు ఈ ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ పెద్దలు కీలక సమావేశం నిర్వహిస్తుండగా, ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ సైతం హాజరు కానున్నట్టు సమాచారం. ఇప్పటికే 'మా' అధ్యక్షులు శివాజీ రాజా, నిర్మాతలు సురేష్‌ బాబు, అల్లు అరవింద్‌, కేయస్‌ రామారావు, దానయ్య, ఘట‍్టమనేని ఆదిశేషగిరిరావు, ఠాగూర్ మధు, అశోక్‌ కుమార్‌, సీ కల్యాణ్‌ లతో పాటు 24 క్రాఫ్ట్స్ కు చెందిన పలువురు హాజరుకాగా, టాలీవుడ్ సమస్యలపై వాడీవేడిగా చర్చ సాగుతోంది.

యన్‌ వి ప్రసాద్‌, వంశీ పైడిపల్లి, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, హరీష్‌ శంకర్‌, జెమినీ కిరణ్ తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ కూడా వస్తారన్న ప్రచారం సాగడంతో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్‌ కు చేరుకోవడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. సమావేశం తరువాత సాయంత్రం 4గంటలకు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని కీలక నిర్ణయాలను ప్రభుత్వం తరఫున ప్రకటిస్తారని తెలుస్తోంది.
Tollywood
Casting Couch
Annapurna Studios

More Telugu News