Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా.. విజయవాడ బెంజ్ సర్కిల్ కు చేరుకుంటున్న జర్నలిస్టులు!

  • కొన్ని టీవీ చానళ్లను బహిష్కరించాలన్న పవన్ కల్యాణ్
  • ధర్నాకు పిలుపునిచ్చిన జర్నలిస్టు సంఘాలు
  • బెంజ్ సర్కిల్ లో అదనపు బలగాలు
తనకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయన్న ఆగ్రహంతో కొన్ని తెలుగు టీవీ చానళ్లను బహిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నేడు విజయవాడ బెంజ్ సర్కిల్ లో ధర్నా జరగనుంది. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్న ఏపీ జర్నలిస్ట్ సంఘాల నేతల నిర్ణయం మేరకు ఈ నిరసన ప్రదర్శన జరగనుంది. అయితే, జర్నలిస్టుల నిరసనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. కాగా, టీవీ 5, టీవీ 9, ఏబీఎన్ చానళ్లను బహిష్కరించాలని నిన్న పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జర్నలిస్టు సంఘాల హెచ్చరికల నేపథ్యంలో బెంజ్ సర్కిల్ ప్రాంతంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
Pawan Kalyan
Journalists
TV Channels
ABN
TV5
TV9

More Telugu News