sanjeev kapoor: అభాసుపాలైన టాప్ చెఫ్ వంటకం... సొషల్ మీడియాలో ఆటాడుకున్న కేరళీయులు!

  • దేశంలో గొప్ప చెఫ్ లలో ఒకరైన సంజీవ్ కపూర్
  • మలబార్ పన్నీర్ వంటకాన్ని పరిచయం చేసిన సంజీవ్ 
  • కేరళీయుల ఎద్దేవా
దేశంలోనే గొప్ప చెఫ్ లలో సంజీవ్ కపూర్ ఒకరన్న సంగతి తెలిసిందే. అలాంటి సంజీవ్ కపూర్ చేసిన వంటకం ఒకటి సోషల్ మీడియాలో అభాసుపాలైంది. కొత్త వంటకాన్ని పరిచయం చేసిన సంజీవ్ కపూర్, ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.

 దాని పేరు ‘మలబార్ పన్నీర్’. పన్నీర్ ను నూనెలో వేయించి, తాలింపు పెట్టి, కొబ్బరి పాలలో పన్నీర్ ను ఉడికించడాన్ని మలబార్ పన్నీర్ అంటారని సంజీవ్ కపూర్ వీడియోలో తెలిపాడు. అంతే.. కేరళీయులు, ప్రధానంగా మలబార్ ప్రాంతానికి చెందిన వారు ఆయనను ఒక ఆటాడుకున్నారు. మలబార్ వంటకాలను వేటితో తయారు చేస్తారో తెలుసా? అని ప్రశ్నించారు. 'కేరళీయులు మలబార్ వంటకాలను చికెన్, మటన్, ఫిష్ లతో చేస్తారు' అంటూ ఒక నెటిజన్ పేర్కొన్నాడు. పసందైన బనారసీ బీఫ్ ను ఎలా చేస్తారో పంపుతానని మరొకరు అనగా, మరో నెటిజన్ కేరళీయులకు పన్నీర్ పెంటతో సమానమని, అలాంటిది మలబార్ పన్నీర్ అని వండుతావా? అంటూ విరుచుకుపడ్డాడు.
sanjeev kapoor
top chaief
malabar paneer
Social Media
trolling

More Telugu News