Pawan Kalyan: 24 గంటల సమయం ఇచ్చి హెచ్చరించిన పవన్ కల్యాణ్‌

  • శాంతి భద్రతల దృష్ట్యా వెళ్లిపోమన్న పోలీసులు
  • ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పందించాలన్న పవన్
  • లేకపోతే రేపు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని వ్యాఖ్య
తన తల్లికి న్యాయం చేసే వరకు తాను ఫిలిం ఛాంబర్‌ వదిలి వెళ్లేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాసేపు అక్కడే కూర్చుని.. కాసేపటికి వెళ్లిపోయిన విషయం విదితమే. ఆయన అక్కడి నుంచి ఒక్కసారిగా ఎందుకు వెళ్లిపోయారన్న విషయంపై స్పష్టత వచ్చింది. ఫిలిం ఛాంబర్‌కి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటోన్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా మెగా హీరోలందరికీ పోలీసులు పలు సూచనలు చేశారు. తమ డిమాండ్‌ను 'మా' పెద్దలకి తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.

దీంతో పోలీసుల సూచనలు అనుసరించిన పవన్ కల్యాణ్‌.. ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఒక్కరోజు గడువు ఇచ్చి, స్పందించకపోతే రేపు తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోగా, అనంతరం మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లిపోయారు.
Pawan Kalyan
Jana Sena
Tollywood

More Telugu News