petrol: ఆల్ టైం రికార్డు ధరకు చేరుకున్న డీజిల్.. నాలుగేళ్ల గరిష్ఠానికి పెట్రోల్

  • మండుతున్న చమురు ధరలు 
  • దక్షిణాసియాలో ఎక్కడా లేని ధరలు భారత్ లోనే
  • ఆల్ టైం రికార్డు ధరకు డీజిల్ 

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దక్షిణాసియా మొత్తంలో ఎక్కడా లేని ధరలు భారత్ లో కనిపిస్తున్నాయి. లీటర్ పెట్రోలు ధర నాలుగేళ్ల గరిష్ఠానికి చేరగా, డీజిల్ ధర ఆల్ టైం రికార్డు ధరకు చేరుకుంది. నేడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 74.08 రూపాయలుగా ఉంది. 2013 సెప్టెంబర్ తరువాత రికార్డు స్థాయి ఇదే కావడం విశేషం.

 ఇక డీజిల్ ధరకు వస్తే నేడు ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 65.31 రూపాయలుగా ఉండగా, కోల్‌ కతాలో 68.01 రూపాయలుగా, ముంబైలో 69.54 రూపాయలుగా, చెన్నైలో 68.9 రూపాయలుగా ఉంది. గత జూన్ లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లు సంయుక్తంగా పదిహేను రోజులకోసారి ధరలు మార్చే విధానాన్ని తీసేసి, బులియన్ మార్కెట్ తరహాలో ప్రతి రోజూ ధరలు మారే విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  

More Telugu News