Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

  • చంద్రబాబు దీక్షని, 'భరత్ అనే నేను' కలెక్షన్స్ ను డైవర్ట్ చేయడానికే ఇదంతా 
  • ఒకవైపు హోదా కోసం దీక్ష జరుగుతుంటే... మీరు చేస్తున్నది ఏమిటి?
  • శ్రీరెడ్డి నిజాయతీ గురించి చెప్పడానికే వీడియో విడుదల చేశా
  • హీరో అయిన మీరు చావు గురించి మాట్లాడటమేమిటి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. పవన్ పై నెగెటివ్ గా కామెంట్ చేయనని మా అమ్మ మీద ఒట్టు వేశానని... కానీ, ఆ తర్వాత ఆయన పెట్టిన ట్వీట్లకు తాను సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో తాను నెగెటివ్ గా కాకుండా, లాజికల్ సమాధానాలు చెప్పాల్సి వచ్చిందంటూనే విమర్శల బాణాలను ఎక్కుబెట్టారు. వర్మ చేసిన కామెంట్లు ఆయన మాటల్లోనే చూడండి.

“మీ ప్రభుత్వం రావటానికి అండగా నిలబడినందుకు ప్రతిఫలంగా మీ కొడుకు, అతని స్నేహితుల ఆధ్వర్యంలో 6 నెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా నా మీద అత్యాచారం జరుపుతూ వచ్చారు. అందులో భాగంగానే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి నాకు సంబంధంలేని విషయాల్లోకి నన్ను లాగి, నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా బూతులు తిట్టించి, దానిని పదే పదే ప్రసారం చేసి, డిబేట్లు పెట్టి, దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యూలేషన్లో  పెట్టారు. రామ్ గోపాల్ వర్మ, టీవీ9 ఓనర్ శ్రీని రాజు, టీవీ9 రవిప్రకాశ్, నారా లోకేష్, అతని ఫ్రెండ్ రాజేష్ కిలారు కలిసి ఇదంతా చేయిస్తున్నారని మీకు తెలియదంటే నన్ను నమ్మమంటారా" అంటూ పవర్ చేసిన కామెంట్ పై వర్మ స్పందిస్తూ....

"పవన్ కళ్యాణ్ గారు, నేను విశ్వ ప్రసిద్ధ రచయిత అగాథా క్రిస్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన కాన్స్పిరసీ థియరీ చదవలేదు. ఇప్పుడు మీరు ఈరోజు ఇంత అర్జెంటుగా పెట్టిన ఈ మీటింగ్... చంద్రబాబు చేపట్టిన స్పెషల్ స్టేటస్ దీక్ష నుంచి డైవర్ట్ చెయ్యడానికి, 'భరత్ అనే నేను' సినిమా కలెక్షన్స్ తగ్గించడానికని నేనూ అనగలను. కానీ అనను. మీడియాతో మీటింగుల బదులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని శ్రీరెడ్డికి సలహా ఇచ్చిన మీరు... ఇప్పుడు అదే పని ఎందుకు చేస్తున్నట్టు?

అదలా ఉంచితే, అసలు ఏపీకి స్పెషల్ స్టేటస్ కంటే లీగలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనే టాపిక్ ముఖ్యమయినదా? అని మీరు అడిగారు. ఈ నేపథ్యంలో, ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే, మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? ఏపీ స్పెషల్ స్టేటస్ కంటే మీకు ఎవరో ఆఫ్ట్రాల్ వ్యక్తి తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లో ఒక మూకుమ్మడి ముఠా అయితే అయ్యుండొచ్చు. ఆ విషయం నాకు తెలియదు గానీ, నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదు. మీరన్న దానికి పాయింట్లుగా నా వివరణ ఇస్తాను.

"సురేష్ బాబు కొడుకు అభిరాం మీద ఇంకా ప్రొసీడ్ అవ్వకపోతే నాలుగో, ఐదో కోట్లు ఇప్పించడానికి ట్రై చేస్తానని శ్రీరెడ్డికి చెప్పాను. కానీ మిమ్మల్ని తిట్టడానికి కాదు. ఇది నేను రిలీజ్ చేసిన వీడియోలో చాలా క్లియర్ గా ఉంది. ఈ విషయాన్ని నేను ప్రస్తావించడానికి కారణం... అంత డబ్బు ఆఫర్ చేసినా... డబ్బు వద్దన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి అందరికీ తెలపటానికే. పెద్దవాళ్ళని అన్నప్పుడే చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది అనాదిగా తెలిసిన సత్యం. మహేష్ కత్తి ఉదాహరణను చెప్పి ఆమెకు సలహా ఇచ్చింది నేను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే... ఈ విషయాన్ని మరెవరో ఇన్వెస్టిగేషన్ చేసి బయటకి తీయలేదు. ఎవరూ అడగకుండా నాకు నేనే నా వీడియో ద్వారా ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాను.

ఇకపోతే మీ అమ్మగారిని తిట్టారన్నది కరక్ట్ కాదు. అమ్మ గురించి కూడా అలా ఆలోచించే ఒక మగాడిని వర్ణించడానికి ఆ పదాన్ని వాడతారు. చాలా విరివిగా సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో కూడా వాడే పదం అది. సినిమాలలో కూడా చాలా విరివిగా 'ల.. కొడుకు' అనే పదం వాడతారు. మీరెప్పుడూ విననంత ఘోరమైన తిట్టు ఇప్పుడు విన్నట్టు అనిపిస్తే... సోషల్ మీడియాలో మీ ఫ్యాన్స్ వాడే తిట్లు వినండి. మీరు కూడా మూర్ఛపోతారు.

ఒకవేళ నిజంగా నేను, మీరు చెప్పిన ఆ మిగతా కూటమి కలిసి ఆ అమ్మాయికి రూ. 5 కోట్లు ఇఛ్చి తిట్టించామనుకుందాం. కేవలం ఒక మామూలు అమ్మాయి మిమ్మల్ని ఉద్దేశించి ఆ పదాన్ని వాడి, తిడితే... దాని మూలాన ఎవరికి ఏం లాభం వస్తుంది? మీ అంత సూపర్ స్టార్ లీడర్ ని రోడ్డు మీద ఒక తిట్టు తిడితే, ఆ తిట్టులో ఉన్న అర్థాన్ని జనాలు నిజమనుకుంటారా? దీనివల్ల మీ క్రెడిబిలిటీ తగ్గిపోతుందా? మీకు వచ్చే ఓట్లు తగ్గిపోతాయా? ఈ విషయంలో మీరు ఊహించుకుంటున్న పేర్లు కలిగిన వారెవరూ లేరు. ఇది కేవలం నా ఒక్కడి తప్పే అని ఇంకొకసారి చెప్పి, 20వ సారి మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటున్నాను.

ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను, ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే... మీరు గుర్తుంచుకోవాల్సింది "నేను ఎంతో కొంత నిస్సహాయులకు అండగా ఉన్నానని... దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడి పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు అంటూ మీరు చెప్పారు. కళ్యాణ్ గారు, హీరో అయిన మీరు మీ శత్రువులని చంపాలి కానీ... మీ చావు గురించి మీరే మాట్లాడటం మీకు తగదు. మీరిలా మాట్లాడటం మీ ఫ్యాన్ గా నాకు బాధ కలిగిస్తోంది. రేపు ఒక రాష్ట్రానికి నాయకుడిగా పోటీ చేయబోయే మీరు... ఇలా మీ చావు గురించి మాట్లాడటం మీకు కానీ, మీరు వచ్చి ఏదో చేస్తారన్న నమ్మకాన్ని పెట్టుకున్న కోట్లమంది మీ అభిమానులకు కానీ మంచిది కాదని నా ఉదేశ్యం"

More Telugu News