Shahrukh Khan: తమిళ హిట్ మూవీ రీమేక్ లో షారుక్

  • తమిళంలో హిట్ కొట్టిన 'విక్రమ్ వేద'
  • విజయ్ సేతుపతి పాత్రలో షారుక్ 
  • దర్శకుడిగా నీరజ్ పాండే  

తమిళంలో కొంతకాలం క్రితం 'విక్రమ్ వేద' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మాధవన్ .. విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి .. కరుడుగట్టిన ఒక రౌడీకి మధ్య జరిగే గొడవగా ఈ సినిమా తెరకెక్కింది.

13 కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా, 65 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాను షారుక్ ఖాన్ తో హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నీరజ్ పాండే ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను షారుక్ చేస్తాడట. ఇక మాధవన్ పాత్రను ఎవరు చేస్తారనేది చూడాలి.  

More Telugu News