Pawan Kalyan: న్యాయవాదులతో పవన్ కల్యాణ్, నాగబాబు భేటీ.. ఫిలిం ఛాంబర్ కు చేరుకున్న అల్లు అర్జున్

  • ఫిలిం ఛాంబర్ లో పవన్, నాగబాబు, అల్లు అర్జున్
  • న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న జనసేనాని
  • భారీగా చేరుకుంటున్న అభిమానులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్న నాగబాబుతో కలసి ఫిలింఛాంబర్ చేరుకున్నారు. న్యాయవాదులతో వీరిద్దరూ సమావేశమయ్యారు. తన తల్లిని బహిరంగంగా దూషించిన ఘటనపై ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశానికి అల్లు అర్జున్ కూడా వచ్చాడు.

తన తల్లిని బహిరంగంగా దూషించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం నుంచి ఆయన వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. తన తల్లిని తిట్టించడంలో టీడీపీ బాసులకు టీవీ9 రవిప్రకాశ్, రామ్ గోపాల్ వర్మ, శ్రీసిటీ యజమాని శ్రీని రాజులు సహకరించారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 
Pawan Kalyan
nagababu
Allu Arjun
film chamber
Jana Sena
legal action
Tollywood

More Telugu News