DIESEL: ప్రజలపై పన్ను బాదుడు వల్లే పెట్రో ధరల మంట: మోదీ సర్కారుపై చిదంబరం విమర్శలు

  • నాలుగేళ్ల క్రితం చమురు బ్యారెల్ 105 డాలర్లు, ఇప్పుడు 74 డాలర్లే
  • అయినా నాటి కంటే నేడే ధరలు ఎక్కువన్న చిదంబరం
  • పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడంపై విమర్శ  

డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజలపై పన్నులు వేసే విధానాన్ని తప్పుబట్టారు. 2014లో మోదీ సర్కారు అధికారం చేపట్టే నాటికి ముడి చమురు బ్యారెల్ 105 డాలర్లు ఉంటే, ఇప్పుడు 74 డాలర్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 

అయినప్పటికీ నాలుగేళ్ల క్రితం నాటి ధరల కంటే ఇప్పుడే డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా మోదీ సర్కారు ఆయిల్ బొనాంజా (తక్కువ ధరలు ఉండడం) అనుభవించిందన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడాన్ని విమర్శించారు. 

More Telugu News