Mahesh Babu: తన తల్లి పాత ఫొటోను పోస్ట్ చేసిన మహేశ్ బాబు

  • మహేశ్ తల్లి జన్మదినం ఈ రోజు 
  • ఈ రోజునే థియేటర్స్ కి 'భరత్ అనే నేను'
  • అభిమానుల్లో ఆనందం
మహేశ్ బాబు కేవలం తన నటన కారణంగానే కాదు .. వ్యక్తిత్వం పరంగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఆయనకి తన తండ్రి కృష్ణ అంటే ఎంత గౌరవమో .. తల్లి ఇందిరాదేవి అంటే అంతటి ప్రేమ. మహేశ్ సూపర్ స్టార్ అయినప్పటికీ ఆ సంతోషాన్ని మౌనంగానే పొందడం ఆమె గొప్పతనం అయితే .. అలాంటి తల్లికి మనసులోనే గుడి కట్టడం మహేశ్ వ్యక్తిత్వం.

ఈ రోజున తన తల్లి పుట్టినరోజు కావడంతో, ఆయన ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా కూడా ఆ విషయాన్ని తెలుపుతూ తన తల్లి పాత ఫోటో ఒకటి పోస్ట్ చేసి ఆనందంతో పొంగిపోయాడు. మహేశ్ తాజా చిత్రంగా 'భరత్ అనే నేను' సినిమా ఇదే రోజున థియేటర్లకు రావడాన్ని అభిమానులు విశేషంగా భావిస్తున్నారు .. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
Mahesh Babu
kiara advani

More Telugu News