‘పాడిందే పాడరా..’ అన్నట్టు.. భారత్ అదే పాటను పదేపదే పాడుతోంది: పాకిస్థాన్
- సర్జికల్ స్ట్రైక్స్ బూటకం
- భారత్ పదేపదే అబద్ధాలు చెబుతోంది
- ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించిన పాక్
మోదీ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశంపై అసలు సర్జికల్ స్ట్రైక్స్ అనేవే జరగలేదని, భారత్ మాటలు బూటకమని కొట్టిపడేసింది. జరగని విషయాన్ని జరిగినట్టు పదేపదే చెబుతోందని విమర్శించింది. అరిగిపోయిన రికార్డులా పదేపదే అదే మాటను వల్లెవేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.