RBI: ఖాతాదారులకు రూ. 1000 కంటే ఎక్కువ ఇవ్వొద్దు.. సిటీ కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు

  • ముంబై సిటీ కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు
  • ఇకపై ఏం చేయాలన్నా తమ అనుమతి తీసుకోవాలని ఆదేశం
  • ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక నిబంధనలు సవరిస్తామన్న రిజర్వు బ్యాంకు

ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితులు ఘోరంగా దిగజారడంతో భారతీయ రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. ముంబైలోని సిటీ కోఆపరేటివ్ బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే వరకు నిబంధనలు పాటించక తప్పదంటూ కొన్ని ఆంక్షలు విధించింది. ఖాతాదారులకు రూ.1000 కంటే ఎక్కువ ఇవ్వొద్దని, అంతకంటే ఎక్కువ సొమ్ము డ్రా చేసుకునేందుకు అనుమతించరాదని ఆదేశాలు జారీ చేసింది.

సేవింగ్, కరెంటు ఖాతాల నుంచి వినియోగదారులు రూ.1000 మాత్రమే డ్రా చేసుకోవాలని, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు ఖాతాదారులను అనుమతించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే, కొత్త డిపాజిట్లు అంగీకరించేందుకు, రుణాలు ఇచ్చేందుకు, తీసుకునేందుకు, పెట్టుబడుల కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సిందేనని పేర్కొంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఆంక్షలు సడలిస్తామని ఆర్బీఐ వివరించింది.

More Telugu News