mammootty: వై.ఎస్. జగన్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ!

  • వై.ఎస్. జీవితచరిత్రగా 'యాత్ర'
  • ప్రధానమైన పాత్రలో మమ్ముట్టి 
  • జగన్ పాత్రలో స్టార్ హీరో సూర్య  

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు మహి వి.రాఘవ్ సన్నాహాలు చేస్తున్నాడు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర .. ఆ యాత్ర చూపిన ప్రభావం .. ఆయనకి విజయాన్ని అందించిన తీరు ఈ సినిమాలో చూపించనున్నారట. అందువలన ఈ సినిమాకి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాలో రాజశేఖర రెడ్డి పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని ఎంపిక చేసుకున్నారు. ఆయన సతీమణి పాత్రలో నయనతారను ఎంపిక చేసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో వై.ఎస్. జగన్ పాత్రలో సూర్య చేయనున్నట్టు ఒక వార్త షికారు చేస్తోంది.      

More Telugu News