kodel siva prasad: సైకిల్ యాత్ర చేస్తున్న కోడెలను ఢీకొన్న ద్విచక్రవాహనం

  • చంద్రబాబు దీక్షకు మద్దతుగా కోడెల సైకిల్ యాత్ర
  • నరసరావుపేట నుంచి కోటప్పకొండకు యాత్ర
  • కోడెల సైకిల్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు చేపడుతున్న నిరాహారదీక్షకు మద్దతుగా నరసరావుపేట నుంచి కోటప్పకొండకు కోడెల ఈ ఉదయం సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

సైకిల్ యాత్ర కొనసాగుతున్న సమయంలో యలమంద వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కోడెల సైకిల్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కోడెల కిందకు పడిపోయారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే ఉన్న నేతలంతా ఆయనను పైకి లేపి, సపర్యలు చేశారు. కాసేపు సేదదీరిన అనంతరం కోడెల తన యాత్రను కొనసాగించారు.

  • Loading...

More Telugu News