amit shah: గురి తప్పిన అమిత్ షా పూలహారం.. ఫెయిల్ కాని యడ్యూరప్ప!

  • అమిత్ షా ప్రచారంలో మరో అపశ్రుతి 
  • బసవన్న విగ్రహానికి నివాళి
  • గురి తప్పి కిందకు జారిపోయిన పూలహారం
  • అపశకునం అంటూ మొదలైన ఊహాగానాలు
దక్షిణాదిలో పాగా వేసే క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఆయన కర్ణాటకలోనే గడుపుతున్నారు. అయితే, ఆయన ప్రచారంలో అడపాదడపా అపశ్రుతులు దొర్లుతున్నాయి. తాజాగా మరో అపశ్రుతి దొర్లింది.

బెంగళూరులోని చాళుక్య సర్కిల్ లో ప్రముఖ సంఘ సంస్కర్త, లింగాయత్ ల ఆరాధ్యుడు అయిన బసవన్న భారీ విగ్రహం ఉంది. బసవన్నకు నివాళి అర్పించేందుకు అమిత్ షా, యడ్యూరప్పలు అక్కడకు చేరుకున్నారు. 12 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహానికి పూల మాల వేసేందుకు వారిద్దరూ క్రేన్ పైకి ఎక్కారు.

 అయినప్పటికీ విగ్రహం తనకన్నా ఎత్తుగా ఉండటంతో... అమిత్ షా విసిరిన దండ గురి తప్పి, కిందకు జారి పడిపోయింది. కానీ యడ్యూరప్ప మాత్రం గురి తప్పలేదు. ఆయన వేసిన దండ బసవన్న మెడలో కరెక్ట్ గా పడింది. మరోవైపు, అమిత్ షా దండ గురితప్పడంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది బీజేపీకి దుశ్శకునమని పలువురు అంటున్నారు. 
amit shah
yedyurappa
basavanna
statue

More Telugu News